సర్కారీ ఇంటర్ పూర్తి ఉచితం
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చేరే విద్యార్ధులు ఇకపై ఫీజులు కట్టనవసరం లేదు. పుస్తకాలను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రెండేళ్ల ఉచిత ఇంటర్మీడియట్ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే కళాశాలల్లో డబ్బు కట్టి ప్రవేశం పొందిన వారికి ఫీజును తిరిగి ఇస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేవలం ఫీజుతో మాత్రమే సరిపెట్టకుండా పుస్తకాలను కూడా విద్యార్ధులకు ఉచితంగానే అందిస్తుందని […]
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చేరే విద్యార్ధులు ఇకపై ఫీజులు కట్టనవసరం లేదు. పుస్తకాలను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రెండేళ్ల ఉచిత ఇంటర్మీడియట్ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే కళాశాలల్లో డబ్బు కట్టి ప్రవేశం పొందిన వారికి ఫీజును తిరిగి ఇస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేవలం ఫీజుతో మాత్రమే సరిపెట్టకుండా పుస్తకాలను కూడా విద్యార్ధులకు ఉచితంగానే అందిస్తుందని ఆయన చెప్పారు. కులమత ఆర్థిక స్థాయీ భేదాలకు అతీతంగా విద్యార్ధులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. విద్యార్ధులు పైసా కట్టకుండా అవసరమైన ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లి దరఖాస్తు నింపి కళాశాలలో చేరిపోవచ్చు. గుర్తింపుకార్డును చూపించి జూలై 31 కల్లా పుస్తకాలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ విద్యను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందని కడియం అన్నారు. ఏటా దాదాపు 1,15,000 మంది విద్యార్ధులు 402 ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్నారు. ఈసారి విద్యార్ధుల సంఖ్య మరో 20 నుంచి 30 వేలకు పెరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇంటర్మీడియట్ బోర్డుపై ఏటా రూ.9 కోట్ల భారం పడుతుంది. ఉచిత పుస్తకాల వల్ల మరో రూ.6 కోట్ల భారం పడుతుంది. అయినా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. తెలంగాణ విద్యార్ధులకు ప్రభుత్వమిస్తున్న కానుకిది అని కడియం శ్రీహరి చెప్పారు. రాబోవు రెండేళ్లలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును దేశంలోనే ఆదర్శబోర్డుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.