'ఆ టేపుల' కోసం ఏసీబీ కోర్టులో ఈ.సీ. మెమో
ఓటుకు నోటు కేసులో చాలా కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులను తమకు అందజేయాలని కోరుతూ ఎన్నికల సంఘం అవినీతి నిరోధక శాఖ కోర్టును ఆశ్రయించింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన హార్డ్‌డిస్క్, టేపులను తమకు అందించాలని కోరుతూ మెమో దాఖలు చేసింది. ఈ టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్ళడం, వాటి పూర్తి పరిశీలన తర్వాత తిరిగి కోర్టుకు అందజేయడం కూడా జరిగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం నాలుగు హార్డ్‌డిస్క్‌లు, మూడు ఆడియో టేపులు తమకు అందజేయాలని ఏసీబీ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో చాలా కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులను తమకు అందజేయాలని కోరుతూ ఎన్నికల సంఘం అవినీతి నిరోధక శాఖ కోర్టును ఆశ్రయించింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన హార్డ్‌డిస్క్, టేపులను తమకు అందించాలని కోరుతూ మెమో దాఖలు చేసింది. ఈ టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్ళడం, వాటి పూర్తి పరిశీలన తర్వాత తిరిగి కోర్టుకు అందజేయడం కూడా జరిగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం నాలుగు హార్డ్‌డిస్క్‌లు, మూడు ఆడియో టేపులు తమకు అందజేయాలని ఏసీబీ అధికారులు ఇప్పటికే ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇదే విధంగా కోరుతూ ఇపుడు ఎన్నికల కమిషన్ కూడా మరో మెమో దాఖలు చేసింది. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఈ దర్యాప్తును పూర్తి చేసుకోవచ్చని ఇంతకుముందే ఏసీబీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇపుడు స్వయంగా తానే ఆడియో, వీడియో టేపుల గురించి ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
Advertisement