స్మృతి రాజీనామా కోరుతూ ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లు ధర్నా
కేంద్ర మానవ వనరుల మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండుతో ఢిల్లీ దద్దరిల్లింది. నకిలీ సర్టిఫికెట్‌తో అఫిడవిట్ ఫైల్ చేసి ఎన్నికల సంఘాన్ని మోసగించిన స్మృతి ఇరానీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు గురువారం రాజధాని వీధులు దద్దరిల్లేలా నిరసన ప్రదర్శన కొనసాగించాయి. వేలాది మంది కార్యకర్తలతో ధర్నాకు దిగాయి. స్మృతి ఇరానీ దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. ఆమె ఇంటి ముందు కార్యకర్తలు ధర్నాకు […]
Advertisement
కేంద్ర మానవ వనరుల మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండుతో ఢిల్లీ దద్దరిల్లింది. నకిలీ సర్టిఫికెట్‌తో అఫిడవిట్ ఫైల్ చేసి ఎన్నికల సంఘాన్ని మోసగించిన స్మృతి ఇరానీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు గురువారం రాజధాని వీధులు దద్దరిల్లేలా నిరసన ప్రదర్శన కొనసాగించాయి. వేలాది మంది కార్యకర్తలతో ధర్నాకు దిగాయి. స్మృతి ఇరానీ దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. ఆమె ఇంటి ముందు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇంటిని చుట్టిముట్టారు. ఓ దశలో ఆమె ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. బీజేపీ డౌన్… డౌన్… స్మృతి రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ ఆరోపణలపై ఆప్ మంత్రిని అరెస్ట్ చేసిన బీజేపీ ప్రభుత్వానికి తమ ప్రభుత్వంలో అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీ కనిపించడం లేదా అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఢిల్లీ వీధులు పిక్కటిల్లెలా నినదించారు.
Advertisement