చంద్రుల రాజీపై తమ్మినేని ఆందోళన...

ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య రాజీకి కుట్ర జరుగుతోందా..? అవున‌నే అంటున్నారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో లేదా గవర్నర్‌ మధ్యవర్తిత్వంతో రాజీ కుదురు తోందా? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పిచ్చోళ్ల మాదిరిగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు చంద్రబాబును బ్రహ్మ దేవుడు […]

Advertisement
Update:2015-06-24 02:59 IST

ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య రాజీకి కుట్ర జరుగుతోందా..? అవున‌నే అంటున్నారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో లేదా గవర్నర్‌ మధ్యవర్తిత్వంతో రాజీ కుదురు తోందా? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పిచ్చోళ్ల మాదిరిగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు చంద్రబాబును బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడంటూ కెసిఆర్‌ హెచ్చరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసుతో సంబంధముండి స్పష్టమైన ఆధారాలున్న సెక్షన్‌-8 అమలుచేయొద్దు ప్రతి ఒక్కర్నీ, చంద్రబాబుతో సహా అందర్నీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారం దాదాపు నెలరోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాం శమైందని అన్నారు. ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వర కూ స్పష్టత లేదని అన్నారు. స్పష్టమైన ఆధారాలున్నాయని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన చర్యలకు ఉపక్రమించకపోవటం సరైన పద్ధతి కాదన్నారు. ‘ఎపి సిఎం చంద్రబాబు తన మాటలను ట్యాప్‌ చేశారని చెబుతున్నారంటే అతడు మాట్లాడిన మాట నిజమే’ అని తెలుస్తోందని పేర్కొన్నారు. అదే చంద్రబాబు ఎంతసేపూ తన ఫోన్‌ ట్యాపింగ్‌ల గురించి మాట్లాడుతున్నారు తప్పితే నిజాన్ని అంగీకరించటం లేదని విమర్శించారు. చూస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల వ్యవహారశైలి… దొంగలు దొంగలు ఊళ్లు పంచుకునే విధంగా ఉందని దుయ్యబట్టారు. ఇలాంటి అవినీతి రాజకీయాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు అన్ని జిల్లాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-8కు, ఓటుకు కోట్లు వ్యవహారానికి ఎలాంటి సంబంధమూ లేదని తమ్మినేని ఈ సందర్బంగా పేర్కొన్నారు. సెక్షన్‌-8 అనేది కేవలం జిహెచ్‌ఎమ్‌సి పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణ, ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్దేశింపబడిందని గుర్తుచేశారు. ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌ అమలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి అంశాలను రాజ్యాంగ నిపుణులు తేల్చాలని అన్నారు. ఈ అంశంలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సీపీఎం ఒప్పుకోదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News