పుష్కరాలకు ఏపీలో 1600 బస్సులు: మంత్రి శిద్దా
గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లో 1600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. పాలకొల్లు, కొవ్వూరు, రాజమండ్రి నుంచి..పుష్కరఘాట్‌ల వరకు ఉచిత బస్సు సర్వీసులుంటాయని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకు 125 కొత్త బస్సులు వస్తాయని, 50 కొత్త వోల్వో, గరుడ బస్సులను కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో 50 బస్సులను అద్దెకు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు వివరించారు. నెలాఖరులోగా పుష్కరాల పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజులు […]
Advertisement
గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లో 1600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. పాలకొల్లు, కొవ్వూరు, రాజమండ్రి నుంచి..పుష్కరఘాట్‌ల వరకు ఉచిత బస్సు సర్వీసులుంటాయని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకు 125 కొత్త బస్సులు వస్తాయని, 50 కొత్త వోల్వో, గరుడ బస్సులను కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో 50 బస్సులను అద్దెకు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు వివరించారు. నెలాఖరులోగా పుష్కరాల పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజులు భారీ వర్షాలు కురవడంతో గోదావరి పుష్కర నిర్మాణాలకు కొంతమేర చేటు జరిగిందని, అయినా ఇంకా సమయముంది కాబట్టి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement