బాబు కొత్త మద్యం పాలసీపై వామపక్షాల ఆందోళన!
బెల్టుషాపులను మూయిస్తానని ఆడపడుచులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు ఇపుడు విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులిచ్చి రాష్ర్టాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వామపక్షాలు విమర్శించాయి. మద్యాన్ని ఆదాయవనరుగా చూడబోమన్న చంద్రబాబు 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చేలా కొత్త పాలసీ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. ఏడాదికి రు.15 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని పొందేలా నగరాలలో షాపింగ్‌మాల్స్, హైపర్‌సూపర్ మార్కెట్లలోనూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తామనడం ప్రభుత్వ విపరీత బుద్ధికి పరాకాష్ట […]
Advertisement
బెల్టుషాపులను మూయిస్తానని ఆడపడుచులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు ఇపుడు విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులిచ్చి రాష్ర్టాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వామపక్షాలు విమర్శించాయి. మద్యాన్ని ఆదాయవనరుగా చూడబోమన్న చంద్రబాబు 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చేలా కొత్త పాలసీ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. ఏడాదికి రు.15 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని పొందేలా నగరాలలో షాపింగ్‌మాల్స్, హైపర్‌సూపర్ మార్కెట్లలోనూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తామనడం ప్రభుత్వ విపరీత బుద్ధికి పరాకాష్ట అన్నారు. రాష్ర్టాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చే నూతన లిక్కర్ పాలసీని వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను వదలిపెట్టి వారి చేత బాగా మద్యం తాగించి ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గుచేటని, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మహిళల ఉద్దరణ గురించి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం వారిని మరింత కడగండ్ల పాలు చేస్తున్నదన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీనిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా అదే ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా మద్యం షాపులు పెంచడం, మాల్స్‌తో సహా ఎక్కడబడితే అక్కడ మద్యం విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
Advertisement