ఆ గొంతు చంద్ర‌బాబుదే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్పేలా లేవు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌తో మాట్లాడిన‌ ఆడియో టేపుల్లో గొంతు చంద్ర‌బాబుదేన‌ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చిన‌ట్లు ‘న‌మ‌స్తే తెలంగాణ’ ప‌త్రిక సంచ‌ల‌న వార్త ప్ర‌చురించింది. మొద‌టి నుంచి ఈ కేసుకు సంబంధించిన సంచ‌ల‌న వార్త‌లను ఆ ప‌త్రికే ప్ర‌చురిస్తూ వ‌స్తోంది. దీంతో చంద్ర‌బాబు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డట్లైంది.  ఈ ఆడియో టేపు ట్యాప్ చేసినది కాదని, ఫోన్‌లో రికార్డయినదేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో […]

Advertisement
Update:2015-06-24 01:48 IST
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్పేలా లేవు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌తో మాట్లాడిన‌ ఆడియో టేపుల్లో గొంతు చంద్ర‌బాబుదేన‌ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చిన‌ట్లు ‘న‌మ‌స్తే తెలంగాణ’ ప‌త్రిక సంచ‌ల‌న వార్త ప్ర‌చురించింది. మొద‌టి నుంచి ఈ కేసుకు సంబంధించిన సంచ‌ల‌న వార్త‌లను ఆ ప‌త్రికే ప్ర‌చురిస్తూ వ‌స్తోంది. దీంతో చంద్ర‌బాబు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డట్లైంది. ఈ ఆడియో టేపు ట్యాప్ చేసినది కాదని, ఫోన్‌లో రికార్డయినదేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేటతెల్లమైనట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కట్ అండ్ పేస్ట్ వ్యవహారంకూడా కాదని ఎఫ్‌ఎస్‌ఎల్ తన నివేదికలో స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ మేరకు సమగ్ర నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి అందించబోతున్నట్లు తెలిపింది. ఈ ప్ర‌క్రియ‌లో ఎలాంటి మార్పు లేక‌పోతే చంద్ర‌బాబుకు నోటీసులు అంద‌డ‌మే త‌రువాయి. దీంతో ఇదే కేసులో డ‌బ్బులు స‌మ‌కూర్చార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌లు కంపెనీల ముఖ్య అధికారుల‌కు, ఎంపీల‌కు నోటీసులు ఇచ్చేందుకూ ఏసీబీ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇక చంద్ర‌బాబు ‘ఏ విధంగా ముందుకెళ్తారో ‘ చూడాలి మ‌రి!
Tags:    
Advertisement

Similar News