విద్యార్ధులకు యోగా పాఠాలు తప్పనిసరి
విద్యార్థులు ఇకపై యోగా నేర్చుకోవడం తప్పనసరి కానుంది. సీబీఎస్ఈ, నవోదయ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్ధులకు యోగాను పాఠ్యాంశంగా చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. యోగాను పాఠ్యాంశంగా చేయడమే కాకుండా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో కూడా చేర్చడానికి కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఈ మేరకు యోగా సిలబస్, విధివిధానాలను ఆమె విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ యోగా తప్పనిసరని ఆమె చెప్పారు. విద్యార్ధులకు 80 […]
విద్యార్థులు ఇకపై యోగా నేర్చుకోవడం తప్పనసరి కానుంది. సీబీఎస్ఈ, నవోదయ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్ధులకు యోగాను పాఠ్యాంశంగా చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. యోగాను పాఠ్యాంశంగా చేయడమే కాకుండా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో కూడా చేర్చడానికి కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఈ మేరకు యోగా సిలబస్, విధివిధానాలను ఆమె విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ యోగా తప్పనిసరని ఆమె చెప్పారు. విద్యార్ధులకు 80 మార్కులు ప్రాక్టికల్స్‌కు, 20 మార్కులు థియరీకి ఉంటాయని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్ధులకు జాతీయస్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు రూ. 5లక్షల నగదు బహుమతిని అందచేస్తామని ఆమె చెప్పారు. యోగాను పాఠ్యాంశంగా చేర్చుకోవాలా, వద్దా అన్న విషయంలో ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చామని మంత్రి చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో కూడా యోగాను ఓ భాగంగా చేస్తున్నామని మంత్రి చెప్పారు.