హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
ఓ హత్యాయత్నం కేసులో ఎమ్యెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష విధించి రాంచీ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. జార్ఖండ్‌లోని లోహర్డగ నియోజకవర్గ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ ఓ హత్యాయత్నం కేసులో నిందితుడు. ఈ కేసును విచారించిన కోర్టు అతనికి ఏడేళ్ల ఖైదుతోపాటు 15 వేల రూపాయల జరిమానా విధించింది. కాగా భగత్.. జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీకి చెందినవాడు కావడం గమనార్హం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న […]
Advertisement
ఓ హత్యాయత్నం కేసులో ఎమ్యెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష విధించి రాంచీ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. జార్ఖండ్‌లోని లోహర్డగ నియోజకవర్గ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ ఓ హత్యాయత్నం కేసులో నిందితుడు. ఈ కేసును విచారించిన కోర్టు అతనికి ఏడేళ్ల ఖైదుతోపాటు 15 వేల రూపాయల జరిమానా విధించింది. కాగా భగత్.. జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీకి చెందినవాడు కావడం గమనార్హం. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరో పార్టీ నాయకుడు అలెస్టర్ బోద్రాకు కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది. ఈ ఇద్దరికి చెరో ఏడు సంవత్సరాల శిక్ష విధించడం ఇపుడు జార్ఖండ్‌లో సంచలనమయ్యింది.
Advertisement