విశాఖలో అక్టోబరులో ఏపీ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు
దేశ, విదేశీ పారిశ్రామిక సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు పేరిట పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 14 వరకు విశాఖపట్టణంలో ఈ సదస్సును నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ)లో నిర్ణయించారు. తీరప్రాంత ప్రజలు హుద్‌హుద్ తుపాన్‌ను ఎదుర్కొని ధీటుగా నిలిచారని, ఈ సదస్సుతో వారిలో నూతనోత్తేజం తీసుకురావాలని ముఖ్యమంత్రి […]
Advertisement
దేశ, విదేశీ పారిశ్రామిక సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు పేరిట పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 14 వరకు విశాఖపట్టణంలో ఈ సదస్సును నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ)లో నిర్ణయించారు. తీరప్రాంత ప్రజలు హుద్‌హుద్ తుపాన్‌ను ఎదుర్కొని ధీటుగా నిలిచారని, ఈ సదస్సుతో వారిలో నూతనోత్తేజం తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఐదు రాష్ట్రాలకు చెందిన సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన రూ. 2003.65 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 35,700 మందికి ఉపాధి లభించనుందంటున్నారు.
Advertisement