గురుకులాల్లో 6, 7 తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ జిల్లాలోని బోరబండ బాలికలు, బాలురు, బార్కాస్‌లోని గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతిలలో చేరాడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ గురుకుల పాఠశాల కన్వీనర్ ఎం.దత్తాత్రేయ శర్మ తెలిపారు. బోరబండ బాలురు 6వ తరగతిలో 7, 7వ తరగతిలో 1, బోరబండ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో 16, 7వ తరగతిలో 1, బార్కాస్ బాలురు (మైనార్టీ) పాఠశాలలో 6వ తరగతిలో 43, 7వ తరగతిలో 43 స్వీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. నేటి నుంచి విద్యార్ధులకు దరఖాస్తులు […]
Advertisement
హైదరాబాద్ జిల్లాలోని బోరబండ బాలికలు, బాలురు, బార్కాస్‌లోని గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతిలలో చేరాడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ గురుకుల పాఠశాల కన్వీనర్ ఎం.దత్తాత్రేయ శర్మ తెలిపారు. బోరబండ బాలురు 6వ తరగతిలో 7, 7వ తరగతిలో 1, బోరబండ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో 16, 7వ తరగతిలో 1, బార్కాస్ బాలురు (మైనార్టీ) పాఠశాలలో 6వ తరగతిలో 43, 7వ తరగతిలో 43 స్వీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. నేటి నుంచి విద్యార్ధులకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 4వ తేదీలోగా బోరబండ బాలురు పాఠశాల్లో అందించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు జూలై 12న బోరబండ బాలుర గురుకుల పాఠశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్ధులు హైదరాబాద్ జిల్లాలో రెండేళ్లు చదివి ఉండాలని, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 60 వేలు మించకూడదన్నారు. సీట్ల కేటాయింపు విద్యార్ధులు రాసిన పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా జరుగుతోందన్నారు.
Advertisement