గిన్నిస్‌లో చోటు 

ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో రాజ్ ప‌థ్‌లో ఆదివారం జ‌రిగిన అంత‌ర్జాతీయ తొలి యోగాదినం వేడుక‌లు గిన్నిస్ రికార్డుల్లో చోటు ద‌క్కించుకున్నాయి. ఒకే వేదిక‌పై అత్య‌ధిక మంది యోగా ప్ర‌ద‌ర్శించ‌డం, వేర్వేరు దేశాల‌కు చెందిన అత్య‌ధిక మంది ఒకే  ప్ర‌దేశంలో  యోగాలో పాల్గొన‌డం అనే రెండు అంశాల్లో ఈ కార్య‌క్ర‌మం రికార్డులు సృష్టించింది. రాజ్‌ప‌థ్ లో 84 దేశాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. గ‌తంలో జివాది విశ్వ‌విద్యాల‌యం గ్వాలియ‌ర్‌లో వివేకానంద కేంద్రం ఆధ్వ‌ర్యంలో 362 పాఠ‌శాల‌ల‌కు చెందిన 29,973 […]

Advertisement
Update:2015-06-21 18:35 IST
ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో రాజ్ ప‌థ్‌లో ఆదివారం జ‌రిగిన అంత‌ర్జాతీయ తొలి యోగాదినం వేడుక‌లు గిన్నిస్ రికార్డుల్లో చోటు ద‌క్కించుకున్నాయి. ఒకే వేదిక‌పై అత్య‌ధిక మంది యోగా ప్ర‌ద‌ర్శించ‌డం, వేర్వేరు దేశాల‌కు చెందిన అత్య‌ధిక మంది ఒకే ప్ర‌దేశంలో యోగాలో పాల్గొన‌డం అనే రెండు అంశాల్లో ఈ కార్య‌క్ర‌మం రికార్డులు సృష్టించింది. రాజ్‌ప‌థ్ లో 84 దేశాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. గ‌తంలో జివాది విశ్వ‌విద్యాల‌యం గ్వాలియ‌ర్‌లో వివేకానంద కేంద్రం ఆధ్వ‌ర్యంలో 362 పాఠ‌శాల‌ల‌కు చెందిన 29,973 మంది విద్యార్ధులు 2005 న‌వంబ‌రు 19న 18 నిమిషాల పాటు చేసిన యోగా రికార్డును ప్ర‌స్తుత రికార్డు తుడిచి పెట్టింది.
Tags:    
Advertisement

Similar News