ఇక ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో 10% మ‌ద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-17 మద్యం విధానాన్ని ప్రకటించింది. సిండికేట్లకు చెక్ పెట్టేలా ఈ నూతన విధానం ఉంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలను అరికట్టేందుకు టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. త్వరలో బార్‌లపై మరో విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో బార్‌లు, క్లబ్‌లు.. టూరిజం హోటళ్లు, రిసార్టులు ఏడాదికోసారి రెన్యువల్ చేయించు కోవాలని రవీంద్ర చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రేవరేజెస్‌లకు […]

Advertisement
Update:2015-06-22 17:57 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-17 మద్యం విధానాన్ని ప్రకటించింది. సిండికేట్లకు చెక్ పెట్టేలా ఈ నూతన విధానం ఉంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలను అరికట్టేందుకు టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. త్వరలో బార్‌లపై మరో విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో బార్‌లు, క్లబ్‌లు.. టూరిజం హోటళ్లు, రిసార్టులు ఏడాదికోసారి రెన్యువల్ చేయించు కోవాలని రవీంద్ర చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రేవరేజెస్‌లకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. గ‌త యేడాది మ‌ద్యం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి 11,500 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని, ఈ యేడాది మ‌రో 20 శాతం అద‌నంగా రెవిన్యూ పెరిగేలా తాము ప్ర‌ణాళిక రూపొందించామ‌ని మంత్రి కొల్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4,380 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు రవీంద్ర తెలిపారు. పది శాతం తగ్గకుండా ప్రభుత్వ దుకాణాలను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని కొల్లు రవీంద్ర చెప్పారు. జులై 1 నుంచి నూతనంగా షాషింగ్‌మాల్స్, హైబ్రీడ్ హైపర్ మార్కెట్స్‌లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. ఈ సంద‌ర్భంగా లైసెన్స్ ఫీజుల వివ‌రాల‌ను కూడా మంత్రి వివ‌రించారు. 5 వేల జనాభాకు రూ. 30 లక్షలు, పది వేల వరకు రూ. 34 లక్షలు, 10-25 వేల వరకు రూ. 37 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ. 45 లక్షలు, ఐదు లక్షలకు పైన జనాభాల ఉంటే రూ.60 లక్షలు ఫీజు ఉండాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. దరఖాస్తుల ఫీజు వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దరఖాస్తుల ఫీజు రూ.30 వేలు, పట్టణాల్లో రూ.40 వేలు, కార్పొరేషన్లలో రూ.50 వేలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌కార్డు సహా రెండేళ్ల ప్లాన్, వ్యాట్ రిటర్న్స్‌తో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 27 వ‌తేదీలోగా స‌మ‌ర్పించాల‌ని, 28న స్ర్కూట్నీ జ‌రుగుతుంద‌ని, 29న క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో డ్రా తీస్తార‌ని, 30వ తేదీన ప్రొవిజ‌న‌ల్ లైసెన్స్‌లు ఇస్తార‌ని, వ‌చ్చేనెల ఒక‌టో తేదీ నుంచి మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News