సినీ పరిశ్రమకు కేసీఆర్ వరాలు
తెలుగుసినీ పరిశ్రమకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. హైదరాబాద్ నగరంలో తెలుగు చలన చిత్రపరిశ్రమకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సినీ దిగ్గజాలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులకు గౌరవం లభిస్తుందో ఆ సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం శిల్పకళావేదికలో సినీనటి జయసుధ తనయుడు శ్రేయన్ నటించిన బస్తీ చిత్రం ఆడియో ఆవిష్కరణ […]
Advertisement
తెలుగుసినీ పరిశ్రమకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. హైదరాబాద్ నగరంలో తెలుగు చలన చిత్రపరిశ్రమకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సినీ దిగ్గజాలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులకు గౌరవం లభిస్తుందో ఆ సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం శిల్పకళావేదికలో సినీనటి జయసుధ తనయుడు శ్రేయన్ నటించిన బస్తీ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీఎం హోదాలో తొలిసారి ఒక సినీ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్నట్టు నగరంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందనే భరోసాను ఇచ్చారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫిలింగనర్ సరిపోకపోతే మరో ఫిలింనగర్‌ను కట్టుకుందామని భరోసా ఇచ్చారు. దేశంలోని ఇతర పరిశ్రమలు ఇక్కడకు రావాలని, ఇక్కడ కళాకారులు ఇతర రంగాలకు పోవాల్సిన అవసరం లేకుండా సకల సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేద సినీ కళాకారులకు ఇండ్ల సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని వాగ్దానం చేశారు.
Advertisement