ఓటుకు నోటు కేసులో గవర్నర్ పరిధిని చెప్పిన ఏ.జి.
ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ నేరుగా పర్యవేక్షించాలని భారత అటార్నీ జనరల్ ఏ.జి. ముకుల్ రోహత్గీ సూచించారు. ఇరు రాష్ట్రాల పోలీసులను నేరుగా తనకు రిపోర్టు చేయమని గవర్నర్ ఆదేశించవచ్చని రోహత్గీ స్పష్టం చేశారు. ఈ కేసులో తనకున్న అధికారాల పరిధి ఏమిటో తెలియజేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్ సలహా కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఓటుకు నోటు కేసును గవర్నర్ స్వయంగా […]
Advertisement
ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ నేరుగా పర్యవేక్షించాలని భారత అటార్నీ జనరల్ ఏ.జి. ముకుల్ రోహత్గీ సూచించారు. ఇరు రాష్ట్రాల పోలీసులను నేరుగా తనకు రిపోర్టు చేయమని గవర్నర్ ఆదేశించవచ్చని రోహత్గీ స్పష్టం చేశారు. ఈ కేసులో తనకున్న అధికారాల పరిధి ఏమిటో తెలియజేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్ సలహా కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఓటుకు నోటు కేసును గవర్నర్ స్వయంగా పర్యవేక్షించాలని, దీనికి సంబంధించిన విషయాలను నేరుగా తనకు నివేదించమని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులను ఆదేశించవచ్చని తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఈ అధికారాలు ఉంటాయని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పోలీసులకు జ్యూరిస్‌డిక్షన్ ఉంటుందన్న విషయాన్ని గవర్నర్ గుర్తించాలని ఆయన తెలిపారు. శాంతిభద్రతలపై కూడా ఇరు రాష్ట్రాల పోలీసులను తనకు నేరుగా నివేదించమని కోరే అధికారం గవర్నర్‌కు ఉంటుందని చెప్పారు. గవర్నర్‌కి ఇచ్చినవి మౌఖిక సలహాలేనని చెప్పిన అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా ఉమ్మడి రాజధాని హైదరబాద్‌లో అధికారాలపై ఏపీ వాదనను అటార్నీ జనరల్ పూర్తి స్థాయిలో సమర్థించారు. రెండు రాష్ట్రా పోలీసులకు ఇక్కడ సమానంగా హక్కులు ఉన్నాయని, జ్యూరిస్‌డిక్షన్ కూడా ఇరు రాష్ర్టాలకు సమానంగా ఉంటుందని అటార్నీ జనరల్ స్పష్టం చేసినట్లుగా తెలియవచ్చింది. హైదరాబాద్‌లో కూడా ఏపీ పోలీస్ స్టేషన్లు పెట్టుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Advertisement