ఏపీ దూకుడు...సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు!
ఓటుకు నోటు ఎర కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఇటీవల ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సమాచారం ఇవ్వాలని 12 కంపెనీల సర్వీస్ ప్రొవైడర్లపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ కంపెనీలకు ఏపీ సీఐడీ అధికారికంగా నోటీసులు ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈకేసులో నాలుగైదు రోజులుగా తెలంగాణ ఏసీబీ దూకుడు తగ్గగా.. […]
ఓటుకు నోటు ఎర కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఇటీవల ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సమాచారం ఇవ్వాలని 12 కంపెనీల సర్వీస్ ప్రొవైడర్లపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ కంపెనీలకు ఏపీ సీఐడీ అధికారికంగా నోటీసులు ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈకేసులో నాలుగైదు రోజులుగా తెలంగాణ ఏసీబీ దూకుడు తగ్గగా.. ఏపీ పోలీసుల దూకుడు పెరగడం గమనార్హం. మరోవైపు ఆడియో టేపుల్లో ఉన్నది బాబు గొంతేనని ఫోరెన్సిక్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించగా, బాబుకు ఫోరెన్సిక్ అధికారుల నుంచి నోటీసులు ఆగిపోనున్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రెండు రాష్ర్టాల నుంచి ఆయా పత్రికల్లో వస్తున్నట్లుగానే పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం. మరోవైపు మత్తయ్యను ఈనెల 24 దాకా అరెస్టు చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికితోడు కేసులో నోటీసులు జారీ చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరారీలో ఉండటంతో తెలంగాణ ఏసీబీ పోలీసులు ఎలా ముందుకెళ్తున్నారో తెలియడం లేదు.