ప్ర‌పంచంలోనే తొలి కిడ్నీ మార్పిడి వర్సిటీ

ప్రపంచంలోనే తొలి కిడ్నీ మార్పిడి విశ్వవిద్యాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటైంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్ (ఐకేడీఆర్‌సీ) ఆధ్వర్యంలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన వర్సిటీని గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ పటేల్‌ ప్రారంభించారు. ఈ వర్సిటీకి ఐకేడీఆర్‌సీ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌ఎల్‌ త్రివేది ఐదేళ్లపాటు చాన్సలర్‌గా ఉంటారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ వర్సిటీలో డయాలసిస్‌ టెక్నాలజీ, అనెస్థీషియా, క్లినికల్‌ నర్సింగ్‌, నర్స్‌ టెక్నీషియన్స్‌, ఇమ్యునాలజీ, బయో కెమిస్ర్టీ తదితర కోర్సులను […]

Advertisement
Update:2015-06-20 19:25 IST
ప్రపంచంలోనే తొలి కిడ్నీ మార్పిడి విశ్వవిద్యాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటైంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్ (ఐకేడీఆర్‌సీ) ఆధ్వర్యంలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన వర్సిటీని గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ పటేల్‌ ప్రారంభించారు. ఈ వర్సిటీకి ఐకేడీఆర్‌సీ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌ఎల్‌ త్రివేది ఐదేళ్లపాటు చాన్సలర్‌గా ఉంటారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ వర్సిటీలో డయాలసిస్‌ టెక్నాలజీ, అనెస్థీషియా, క్లినికల్‌ నర్సింగ్‌, నర్స్‌ టెక్నీషియన్స్‌, ఇమ్యునాలజీ, బయో కెమిస్ర్టీ తదితర కోర్సులను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా కణాభివృద్ధి, డయాబెటిక్‌ నెఫ్రోపతీ, ఇమ్యునాలజీ తదితర అంశాలపై పరిశోధనలు చేయనున్నట్టు వివరించారు.
Tags:    
Advertisement

Similar News