పుణెకు ఫోరెన్సిక్ టేపులు...?
ఓటుకు కోట్లు వ్యవహారంలో అత్యంత కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు? వారసలు నివేదిక ఇచ్చారా? ఇస్తే ఆ నివేదికలో ఏముంది? ఎందుకు ఆలస్యం జరుగుతోంది… ఈ ప్రశ్నలు ఇపుడు అందరినీ వేధిస్తున్నాయి. అయితే ఈ టేపులను ఫోరెన్సిక్ నిపుణులు పూణేకి పంపించారట. అందుకే నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరిగినట్లు సమాచారం. పూణే నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే ఇక్కడి అధికారులు తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను, అక్కడి నుంచి వచ్చిన […]
Advertisement
ఓటుకు కోట్లు వ్యవహారంలో అత్యంత కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు? వారసలు నివేదిక ఇచ్చారా? ఇస్తే ఆ నివేదికలో ఏముంది? ఎందుకు ఆలస్యం జరుగుతోంది… ఈ ప్రశ్నలు ఇపుడు అందరినీ వేధిస్తున్నాయి. అయితే ఈ టేపులను ఫోరెన్సిక్ నిపుణులు పూణేకి పంపించారట. అందుకే నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరిగినట్లు సమాచారం. పూణే నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే ఇక్కడి అధికారులు తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను, అక్కడి నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి సమగ్ర నివేదిక ఇస్తారని సమాచారం. గొంతు ఎవరిదనేది ప్రాథమికంగా నిర్థారించినప్పటికీ ఈ కేసులో ఉన్నది హై ప్రొఫైల్ వ్యక్తులు కావడంతో మరింత స్పష్టత, మరింత జాగ్రత్త కోసం పూణేకి పంపించారని తెలిసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులు ఉన్నాయని, పుణెలోని అత్యంత నిపుణులైన వ్యక్తులు వీటిని పరిశీలిస్తున్నారని అధికారవర్గాలంటున్నాయి. ఫూణేలో మన దేశంలోనే మెరుగైన సదుపాయాలున్నఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేసుల్లో సాక్ష్యాధారాల పరిశీలన ఇక్కడ జరిగింది.
Advertisement