ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అఖిల్
సిసింద్రీ నుంచి మరో వీడియో విడుదలైంది. చెప్పిన మాట ప్రకారం.. తన కొత్త సినిమాకు సంబంధించి మరో పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేశాడు అఖిల్. ట్విట్టర్ లో చెప్పినట్టు సరిగ్గా 10గంటలకు విడుదలైంది ఆ వీడియో. విదేశాల్లో అఖిల్ నటించిన పోరాట దృశ్యాలతో ఈ వీడియో తెరకెక్కింది. కొన్ని సన్నివేశాల్లో అచ్చం మహేష్ బాబుకు తమ్ముడిలా కనిపించిన అఖిల్.. ఫైట్ సీక్వెన్స్ లో అద్భుతంగా నటించాడు. కొన్ని సీన్స్ లో అయితే డూప్ లేకుండా, ఎలాంటి […]
Advertisement
సిసింద్రీ నుంచి మరో వీడియో విడుదలైంది. చెప్పిన మాట ప్రకారం.. తన కొత్త సినిమాకు సంబంధించి మరో పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేశాడు అఖిల్. ట్విట్టర్ లో చెప్పినట్టు సరిగ్గా 10గంటలకు విడుదలైంది ఆ వీడియో. విదేశాల్లో అఖిల్ నటించిన పోరాట దృశ్యాలతో ఈ వీడియో తెరకెక్కింది. కొన్ని సన్నివేశాల్లో అచ్చం మహేష్ బాబుకు తమ్ముడిలా కనిపించిన అఖిల్.. ఫైట్ సీక్వెన్స్ లో అద్భుతంగా నటించాడు. కొన్ని సీన్స్ లో అయితే డూప్ లేకుండా, ఎలాంటి తాడు సహాయం తీసుకోకుండా నటించడం విశేషం. మొదటి వీడియో తో అనుకున్న స్థాయిలో మార్కులు తెచ్చుకోలేకపోయిన అఖిల్, తన రెండో వీడియోతో మాత్రం నూటికి నూరుమార్కులు సొంతం చేసుకున్నాడు. సినిమాకు ఓ మాంచి హైప్, ఊపు తీసుకొచ్చింది ఈ రెండో వీడియో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్-అనూప్ రూబెన్స్ సంయుక్తంగా బాణీలు అందిస్తున్నారు. వచ్చే నెలలో అఖిల్ సినిమా పేరును గ్రాండ్ గా ఎనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున.
Advertisement