ఓటుకు నోటు కేసులో టేపుల మాయానికి కుట్ర!
ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు మాజీ ఫోరెన్సిక్ అధికారిని తన సలహాదారుడిగా నియమించుకోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కీలకాధికారిగా పని చేసి చక్రం తిప్పిన ఆ అధికారిని చంద్రబాబు సలహాదారుడిగా నియమించుకోవడం వెనుక కేసు నుంచి బైట పడేందుకు వీలుగా టేపులు మాయం చేసే కుట్ర పన్నాడని టీ.సర్కార్ భావిస్తోంది. దీంతో ఆడియో, వీడియో టేపుల వ్యవహారంపై ఫోరెన్సిక్ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు మాజీ ఫోరెన్సిక్ అధికారిని తన సలహాదారుడిగా నియమించుకోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కీలకాధికారిగా పని చేసి చక్రం తిప్పిన ఆ అధికారిని చంద్రబాబు సలహాదారుడిగా నియమించుకోవడం వెనుక కేసు నుంచి బైట పడేందుకు వీలుగా టేపులు మాయం చేసే కుట్ర పన్నాడని టీ.సర్కార్ భావిస్తోంది. దీంతో ఆడియో, వీడియో టేపుల వ్యవహారంపై ఫోరెన్సిక్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టేపులపై లీకులివ్వడం, కేసును నీరుకార్చే వ్యవహారాలకు పాల్పడితే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడమని ఎఫ్ ఎస్ ఎల్ ఉన్నతాధికారులలు తమ సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో, వీడియోపై అనాలసిస్ చేస్తున్న ఎఫ్‌సిఎల్ అధికారులను మాజీ అధికారి ప్రభావితం చేసి తప్పుడు నివేదిక ఇవ్వకుండా ఉండేందుకు ఏసీబీ, ఫోరెన్సిక్ ఉన్నతాధికారులు చాకచక్యంగా అడుగులు వేస్తున్నారు.
అంతా చంద్రబాబు సలహాదారుడి మనుషులే
మాజీ ఫోరెన్సిక్ అధికారిని ఏపీ సీఎం సలహాదారుడుగా నియమించుకోవడం వెనుక మరో ఎత్తుగడ ఉన్నట్లు టీ.ప్రభుత్వం భావిస్తోంది. ఆయన కొన్ని ఏళ్లపాటు ఆ విభాగాన్ని శాసించిన అధికారి కావడం, ఆయన పని చేస్తున్న సమయంలో తన మనుషులనే ఉన్నతస్థానాల్లో నియమించుకోవడం జరిగింది. ఇప్పటికీ విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారు ఏపీ సీఎంకు అనుకూలంగా నివేదిక అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీరి కదలికపై నిఘా పెంచడంతోపాటు కేసులో లోపాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గాంధీని నియమించడం వెనుక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కెపిసి గాంధీని నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ గతంలో ఫోరెన్సిక్ విభాగంలో పనిచేశారు. ఆ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఫోరెన్సిక్ విభాగ డైరెక్టర్‌గా పనిచేశారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన వీడియో, ఆడియో టేపులు ఇపుడు తెలంగాణ ఫోరెన్సిక్ విభాగంలో ఉన్నాయి. ఆ విభాగం ఇచ్చే నివేదిక కచ్చితంగా తమకు వ్యతిరేకంగా ఉంటుందని చంద్రబాబుకు తెలుసు.. అందుకే దాన్నుంచి బయటపడడం కోసం ఆ విభాగంలో అనుభవం ఉన్న గాంధీని సలహాదారుగా నియమించుకున్నారని అంటున్నారు. ఇపుడు చంద్రబాబు సలహాదారులంతా రాజకీయ అనుభవం ఉన్నవారే కావడం గమనార్హం. ఒక రంగంలో నిపుణుడిని సలహాదారుగా నియమించుకోవడం ఇదే ప్రథమం.
Advertisement