వర్షాలతో ముంబాయి అతలాకుతలం
ఒక రోజంతా…ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముంబై మహా నగరం మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ మోకాల్లోతు నీటితో సరస్సులను తలపిస్తున్నాయి. ముంబైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపైకి నీరు చేరటంతో.. పలు రూట్లలో లోకల్ రైళ్లు రద్దయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్థవ్యస్తమైంది. దేశ ఆర్థిక రాజధానిని కుండపోత అతలాకుతలం చేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు.. గడచిన 24 గంటల్లో […]
Advertisement
ఒక రోజంతా…ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముంబై మహా నగరం మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ మోకాల్లోతు నీటితో సరస్సులను తలపిస్తున్నాయి. ముంబైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపైకి నీరు చేరటంతో.. పలు రూట్లలో లోకల్ రైళ్లు రద్దయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్థవ్యస్తమైంది. దేశ ఆర్థిక రాజధానిని కుండపోత అతలాకుతలం చేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు.. గడచిన 24 గంటల్లో 283 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే పది రోజుల్లో కురిసే వర్షం ఇక్కడ ఒక్కరోజే కురిసిందన్నమాట. ముంబై సెంట్రల్‌లోని వాల్దాలో విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలుడు, 60 ఏళ్ల వృద్దురాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు సహా, అన్ని న్యాయస్థానాలకు ఒకరోజు శెలవు ప్రకటించారు. విద్యా సంస్థలను మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్న రాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఆరు సబ్‌స్టేషన్‌ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కొన్ని ప్రాంతాలలో ముందు జాగ్రత్తగా తామే విద్యుత్ సరఫరా నిలిపివేశామని బీఎంసీ అధకారులు చెప్పారు.
Advertisement