మరో 4 రోజులు గడువు కోరనున్న సండ్ర
ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరో నాలుగు రోజులపాటు గడువు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సండ్ర ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు హాజరు అయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని సండ్ర వీరయ్య ఏసీబీని కోరనున్నట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు వ్యవహారంలో తమ […]
Advertisement
ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరో నాలుగు రోజులపాటు గడువు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సండ్ర ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు హాజరు అయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని సండ్ర వీరయ్య ఏసీబీని కోరనున్నట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ ఇచ్చిన గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈనెల 19లోగా తమ ఎదుట హాజరు కావాలని ఆయనకు ఏబీసీ నోటీసు పంపిన సంగతి తెలిసిందే.
Advertisement