2020నాటికి దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్
దేశమంతటా సౌర విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2020నాటికి దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 40 వేల మెగావాట్లు ఇంటి పైభాగంలో సౌర ఫలకాల ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి చేయాలని, మిగతా 60 వేల మెగావాట్లు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం రాబోయే కాలంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. తొలి దశలో […]
Advertisement
దేశమంతటా సౌర విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2020నాటికి దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 40 వేల మెగావాట్లు ఇంటి పైభాగంలో సౌర ఫలకాల ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి చేయాలని, మిగతా 60 వేల మెగావాట్లు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం రాబోయే కాలంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. తొలి దశలో ఇందుకోసం రూ.15,050 కోట్లు సబ్సిడీగా అందించనున్నట్టు కేంద్ర సమాచార, ఐటి శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఇది ఐదింతలు ఎక్కువన్నారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ అనేక సంపన్న దేశాలను సైతం మించి పోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న భారత ప్రమాణాల చట్టం స్థానంలో ‘భారత ప్రమాణాల బిల్లు, 2015 పేరుతో కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం మరిన్ని వస్తువులు, సేవలు, తయారీ విధానాల నాణ్యతా ప్రమాణాలు బిఐఎస్ పరిధిలోకి రాబోతున్నాయి.
16 విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఓకే
రూ.6,651 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో దాదాపు నాలుగు వేల కోట్ల పెట్టుబడులు ఫార్మా రంగానికి సంబంధించివే. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) పెట్టుబడి పరిమితిని టొరెంట్ ఫార్మా, సింజన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈక్విటీని పెంచేందుకు సైతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనల వల్ల దాదాపు నాలుగు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు సమకూరతాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) సిఫారసుల మేరకు గత నెల 28న జరిగిన కేబినెట్ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలోని ఆరో నంబర్ జాతీయ రహదారిని రూ.7,528.74 కోట్లతో నాలుగు వరుసల రహదారిగా వెడల్పు చేసే ప్రతిపాదనకు సైతం కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
Advertisement