దేశంలో మరోసారి ఎమర్జెన్సీ: అద్వానీ జోస్యం
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కుదుపే కుదిపాయి. ఆయన మాటలు మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. పైగా మోడీ నాయకత్వం వల్ల దేశానికి ఎంత ప్రయోజనం అనే సందేహాల్ని లేవనెత్తాయి. ఆయన అన్న మాటల్ని ఒక్కసారి పరిశీలిస్తే…. రాజకీయ నాయకుల్లో పరిపక్వత రాకపోయినా… లేకపోయినా మరోసారి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వచ్చే అవకాశం లేకపోలేదని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు […]
Advertisement
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కుదుపే కుదిపాయి. ఆయన మాటలు మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. పైగా మోడీ నాయకత్వం వల్ల దేశానికి ఎంత ప్రయోజనం అనే సందేహాల్ని లేవనెత్తాయి. ఆయన అన్న మాటల్ని ఒక్కసారి పరిశీలిస్తే…. రాజకీయ నాయకుల్లో పరిపక్వత రాకపోయినా… లేకపోయినా మరోసారి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వచ్చే అవకాశం లేకపోలేదని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ చెప్పారు. భారత్‌లో రాజకీయ నాయకత్వం పరిణతి చెందలేదని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో నిబద్దత కొరవడిందని తెలిపారు. అత్యవసర పరిస్థితిని విధించడం అంత తేలికైన విషయం కాదుగాని, రాదని మాత్రం తనకు నమ్మకం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన నిబద్దత చాలా అంశాల్లో లేదని, నాయకత్వం కూడా సరైన దిశలో పయనించడం లేదని అద్వానీ పేర్కొన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన అద్వానీ మాటలకు ఎవరికి తోచిన అర్ధం వారిచ్చుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న నరేంద్రమోడిని ఉద్దేశించేదేనని రాజకీయ నాయకులు భాష్యం చెబుతున్నారు. అద్వానీ మాటలు ఖచ్చితంగా నిజం అవుతాయని, మొదటగా ఢిల్లీలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి చాలా కాలం నుంచే ఘర్షనాత్మక వాతావరణం ఉండడంతో తన ప్రభుత్వానికి ఆయన ఆపాదించుకుని ఈ మాటలన్నట్టు తెలుస్తోంది. అద్వానీ చాలా సీనియర్ నాయకుడని, ఆయన మాటలకు ఎంతో విలువ ఉంటుందని, బహుశా మోడీ నాయకత్వంపై ఆయనకున్న అభిప్రాయంతోనే ఇలాంటి మాటలు అని ఉండవచ్చని సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. అద్వానీ మాటలు మోడీ నాయకత్వంపై దాడి అని కాంగ్రెస్ నాయకుడు టాం వడక్కన్ అన్నారు.
మోడీ నాయకత్వం దేశానికి అవసరమని బీజేపీ భావిస్తున్న తరుణంలో దీన్ని ముక్కుసూటిగా వ్యతిరేకించి నాయకుడు అద్వానీ. అందుకే ఆయన మోడీ ప్రధానిగా విఫలమయ్యారన్న ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్నది రాజకీయ పండితుల మనోగతం. అద్వానీ మాటలపై బీజేపీలోని మరో నాయకుడు, సీనియర్ జర్నలిస్టు ఎం.జె.అక్బర్ వ్యాఖ్యానిస్తూ ఆయన ఏ వ్యక్తికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం వ్యవస్థల తీరుతెన్నులను చూసి అద్వానీ తన అభిప్రాయం చెప్పారని అన్నారు. అద్వానీ రాజకీయాలు, వయస్సు దృష్ట్యా చాలా సీనియర్ నాయకుడు. మోడీ మీద ఏదైనా స్పష్టమైన అభిప్రాయముంటే నేరుగా చెప్పే అవకాశం ఆయనకు ఉంది. పైగా ఆయన పార్టీ సలహా మండలిలో కీలక భూమిక నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మోడికి సందేశం ఇవ్వడం ఆయన ఉద్దేశ్యంగా నేను భావించడం లేదు… అని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎం.జి. వైద్య అన్నారు.
Advertisement