రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
కొత్త రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర సంపర్క్ సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ ఏడాది కిందట రాష్ట్రంలో రెండు లక్షల సభ్యత్వాలు బీజేపీకి ఉండగా నేడు 23 లక్షల మంది సభ్యులున్నారన్నారు. దేశవ్యాప్తంగా పదిన్నర కోట్ల మంది బీజేపీకి సభ్యులుగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 45 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చేలా ప్రతి పార్టీ […]
Advertisement
కొత్త రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర సంపర్క్ సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ ఏడాది కిందట రాష్ట్రంలో రెండు లక్షల సభ్యత్వాలు బీజేపీకి ఉండగా నేడు 23 లక్షల మంది సభ్యులున్నారన్నారు. దేశవ్యాప్తంగా పదిన్నర కోట్ల మంది బీజేపీకి సభ్యులుగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 45 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ఆమె సూచించారు. 2019 ఎన్నికల నాటికి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తాము అడిగినన్ని సీట్లు ఇచ్చేలా బీజేపీని బలోపేతం చేస్తామని, దీనికిగాను ప్రతి కార్యకర్త ప్రతిజ్ఞ పూనాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.900 కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. బీజేపీ పేదవర్గాల సంక్షేమానికే పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని పురందేశ్వరి అన్నారు
Advertisement