భార్య హంతకుడికి జీవిత ఖైదు
అదనపు కట్నం కోసం వేధించి, అనుమానంతో కిరోసిన్ పోసి భార్యను కడతేర్చిన దోషికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తెనాలిలోని పినపాడుకు చెందిన విజయలక్ష్మికి పెదపూడికి చెందిన ఉప్పురెట్ల ఉమామహేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కావాలంటూ భార్యను ఉమామహేశ్వరరావు వేధించటం మొదలెట్టాడు. అలాగే అనుమానంతో ఆమెను హింసించేవాడు. భార్యను ఎలాగైనా హత మార్చాలని పథకం వేశాడు. 2014 జనవరి 24న ఇంట్లో వంట చేస్తున్న భార్యతో […]
Advertisement
అదనపు కట్నం కోసం వేధించి, అనుమానంతో కిరోసిన్ పోసి భార్యను కడతేర్చిన దోషికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తెనాలిలోని పినపాడుకు చెందిన విజయలక్ష్మికి పెదపూడికి చెందిన ఉప్పురెట్ల ఉమామహేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కావాలంటూ భార్యను ఉమామహేశ్వరరావు వేధించటం మొదలెట్టాడు. అలాగే అనుమానంతో ఆమెను హింసించేవాడు. భార్యను ఎలాగైనా హత మార్చాలని పథకం వేశాడు. 2014 జనవరి 24న ఇంట్లో వంట చేస్తున్న భార్యతో గొడవపడి కిరోసిన్ పోసి గ్యాస్ స్టౌవ్ వెలిగించి చిరకొంగుకు నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా జరిగిన విచారణలో చివరకు తుది తీర్పు వచ్చింది. నిందితుడికి హత్య కేసులో జీవిత ఖైదు, రూ.1000 జరిమానా, అదనపు కట్నం వేధింపులో మూడేళ్లు జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Advertisement