నేష‌న‌ల్ హైవేస్‌లో టి-కి మొండిచేయి

నూతన జాతీయ రహదారుల మంజూరులో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణకు మొండిచేయి చూపారు. జాతీయ రహదారుల విస్తీర్ణంలో వెనకబడ్డ తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో విస్మరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 707 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా కల్పించేందుకు అనుమతించారు. వెయ్యి కి.మీ. మేర రోడ్లకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దీనికి గడ్కా రీ […]

Advertisement
Update:2015-06-16 18:35 IST
నూతన జాతీయ రహదారుల మంజూరులో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణకు మొండిచేయి చూపారు. జాతీయ రహదారుల విస్తీర్ణంలో వెనకబడ్డ తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో విస్మరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 707 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా కల్పించేందుకు అనుమతించారు. వెయ్యి కి.మీ. మేర రోడ్లకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దీనికి గడ్కా రీ సానుకూలత వ్యక్తం చేసినా ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీనిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ వద్ద తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఢిల్లీ వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గడ్కారీ అపాయింట్‌మెంట్ కోసం ఆయన కార్యాలయానికి తుమ్మల అత్యవసరంగా లేఖ రాశారు. మరో 2, 3 రోజుల్లో ఆయన గడ్కారీతో భేటీ కానున్నారు.
Tags:    
Advertisement

Similar News