ఏసీబీకి ఆ అధికారం ఉంది...

 ‘‘తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఎలా ఇస్తుంది..?’’ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రుల ప్రశ్న ఇది. స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అయితే భారత నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ), ఇండియన్ పీనల్‌కోడ్ (ఐపీసీ) నిబంధనల ప్రకారం ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏసీబీకి తెలంగాణ అధికారులను విచారించే అధికారం మాత్రమే ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు […]

Advertisement
Update:2015-06-17 09:49 IST
‘‘తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఎలా ఇస్తుంది..?’’ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రుల ప్రశ్న ఇది. స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అయితే భారత నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ), ఇండియన్ పీనల్‌కోడ్ (ఐపీసీ) నిబంధనల ప్రకారం ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏసీబీకి తెలంగాణ అధికారులను విచారించే అధికారం మాత్రమే ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వాదనలను వారు కొట్టిపడేస్తున్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం బాధిత పక్షం(అగ్రీవ్‌డ్ పార్టీ) గా ఉంది. ఒకసారి క్రిమినల్ లా పని ప్రారంభమైతే సాక్ష్యాలు సేకరించకుండా దర్యాప్తు సంస్థను ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అని క్రిమినల్ లాయర్ సి.మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో తెలుగుదేశం పార్టీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలని చూసింది. అదే గనుక జరిగితే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినట్లయేది. అందువల్ల ఏసీబీ సీఆర్‌పీసీలోని 120(బి) సెక్షన్‌ను ప్రయోగించింది. ఈ సెక్షన్ కింద దర్యాప్తు సంస్థకు విస్తృత అధికారాలు లభిస్తాయి’’ అని మల్లేశ్వరరావు వివరించారు. ‘‘రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం చంద్రబాబునాయుడు హైదరాబాద్ పౌరుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయనకు ప్రత్యేక హక్కులు గానీ, రక్షణలు గానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే లభిస్తాయి. తెలంగాణలో కాదు’’ అని మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సొంత పోలీస్ స్టేషన్లు పెట్టుకోవచ్చని రాజ్యాంగంలో గానీ, పునర్విభజన చట్టంలో గానీ లేదు’’ అని హైకోర్టు న్యాయవాది సత్యం రెడ్డి పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News