ఆంధ్రలో ఎన్టీవీపై 'చినబాబు' పంజా!
ఓటుకు నోటు కేసులో తమ పార్టికి నష్టం కలిగించే విధంగా ఎన్టీవీ ప్రసారాలు ఉంటున్నాయని తక్షణం ఆ ఛానల్ ను నిలిపి వేయించాలని ఎపికి చెందిన ఒక మంత్రి గారు నారా వారి చినబాబుకి చెప్పడంతో తక్షణం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఆ చానెల్ ప్రసారాలు ఆపేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరీ ఇంత దారుణమా? మీడియా స్వేచ్చలో భాగంగా ఎన్టీవీ కధనాలు ప్రసారం చేస్తుంటే వారి గొంతు నొక్కడం ఏ మేరకు న్యాయం? తెలంగాణలో ఇప్పటికే ఏబీఎన్ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో తమ పార్టికి నష్టం కలిగించే విధంగా ఎన్టీవీ ప్రసారాలు ఉంటున్నాయని తక్షణం ఆ ఛానల్ ను నిలిపి వేయించాలని ఎపికి చెందిన ఒక మంత్రి గారు నారా వారి చినబాబుకి చెప్పడంతో తక్షణం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఆ చానెల్ ప్రసారాలు ఆపేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరీ ఇంత దారుణమా? మీడియా స్వేచ్చలో భాగంగా ఎన్టీవీ కధనాలు ప్రసారం చేస్తుంటే వారి గొంతు నొక్కడం ఏ మేరకు న్యాయం? తెలంగాణలో ఇప్పటికే ఏబీఎన్ ఆంద్రజ్యోతి ఛానల్ రావడం లేదు. ఇదే మాదిరిగా ఆంధ్రాలో ఎన్టీవీ ఛానల్‌కూ జరుగుతోంది. ఇలా చేస్తే కెసిఆర్‌కి వీరికి తేడా ఏమిటి ? వారిని విమర్శించే నైతిక హక్కు వీరికి ఎక్కడిది ? ఒక ఛానల్ కాని, పత్రిక కాని తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళడమో, ఇతర మార్గాల ద్వారా పోరాటం చేయడమో చేయాలి. కాని అలాంటి మార్గాలను అనుసరించే విధానానికి రాజకీయ పార్టీలు తిలోదకాలిచ్చాయా అనే సందేహం కలుగుతోంది. కక్ష పూరితంగా ఒక ఛానల్ ప్రసారాలు పూర్తిగా నిలిపే దమ్ము ఇప్పుడు ఏ ఒక్కరికి లేదు . ఎందుకంటే నేడు సోషల్ మీడియా ప్రభంజనం కమ్ముకొస్తుంది . ఎబిఎన్ , టివి నైన్ ప్రసారాలను కేబుల్ ద్వారా తెలంగాణలో అడ్డుకున్నా గాల్లో వచ్చే సోషల్ మీడియాను ఎవరు అడ్డుకోలేక పోయారు . చానల్స్ రూపొందించుకున్న యాప్‌ల ద్వారా ఆ చానల్స్ చూడాలనుకున్న వారు తెలంగాణలో హాయిగా చూశారు. ఇప్పుడు అంతే ఎన్టీవీ ప్రసారాలను ఇంటర్‌నెట్ లైవ్‌లో చూస్తారు . దీనివల్ల పసుపు పచ్చపార్టీకి అప్రదిష్ట చుట్టుకుంటుంది. మీడియా పక్షపాతిగా దేశ వ్యాప్తంగా పేరున్న ఎపి సిఎమ్ బాబు గారికి ఇది తెలిసే చేశారా లేదా అన్నది తేలాలి. ఒక వేళ బాబుగారి కనుసన్నలలోనే ఇదంతా జరిగితే మరో ఘోరమైన చారిత్రిక తప్పిదానికి టిడిపి నాంది పలికిందనే అనుకోవాలి . తప్పుల మీద తప్పులు చేస్తున్న వారిని దేముడే కాపాడాలి… నిన్నటి వరకు మీడియా స్వేచ్చపై గొంతెత్తిన పసుపు దళం ఇప్పుడు దీనిపై ఏమి చెబుతుంది?
Advertisement