వాటర్‌గ్రిడ్‌లో రూ.300కోట్ల అవినీతి: సీతక్క
వాటర్‌గ్రిడ్ టెండర్లలో రూ.300 కోట్లు చేతులు మారాయని టీ-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీతక్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మణుగూరు వచ్చిన ఆమె పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఐపాస్ అంటూ కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తున్న కేసీఆర్ పాత పరిశ్రమలను మరిచిపోయారని ఆరోపించారు. వరంగల్ జిల్లా కమలాపురంలో రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడి మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డా తెరిపించే యత్నం చేయకపోగా, కనీసం తనను కలుసుకునే అవకాశం కూడా […]
Advertisement
వాటర్‌గ్రిడ్ టెండర్లలో రూ.300 కోట్లు చేతులు మారాయని టీ-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీతక్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మణుగూరు వచ్చిన ఆమె పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఐపాస్ అంటూ కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తున్న కేసీఆర్ పాత పరిశ్రమలను మరిచిపోయారని ఆరోపించారు. వరంగల్ జిల్లా కమలాపురంలో రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడి మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డా తెరిపించే యత్నం చేయకపోగా, కనీసం తనను కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమ పరిస్థితి ఇదేనన్నారు. తెలంగాణలో వేల మందికి ఉపాధినిచ్చే పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డా, పటించుకోని కేసీఆర్ కొత్త పరిశ్రమల కోసం పాకులాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన సీఎం అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఆయనది తెలంగాణ భాష కాదని.. తెలంగాణ ప్రజలను అవమానించేదిగా ఉందన్నారు. ముందు కేసీఆర్ తన భాష మార్చుకోవాలని ఆమె సూచించారు.
Advertisement