పాలమూరు ఎత్తిపోతలపై కేంద్రానికి జ‌గ‌న్ ఫిర్యాదు

తెలంగాణ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ కేంద్ర జలవనరులమంత్రి ఉమాభారతికి ఆదివారం లేఖ రాశారు. విభజన చట్టంలోని అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని జగన్ తన లేఖలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. టి సర్కార్ చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం విభజన చట్టానికి వ్యతిరేకమని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే.. రాయలసీమ, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాలు ఏడారిగా మారడం ఖాయమని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం తక్షణమే […]

Advertisement
Update:2015-06-15 01:13 IST
తెలంగాణ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ కేంద్ర జలవనరులమంత్రి ఉమాభారతికి ఆదివారం లేఖ రాశారు. విభజన చట్టంలోని అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని జగన్ తన లేఖలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. టి సర్కార్ చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం విభజన చట్టానికి వ్యతిరేకమని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే.. రాయలసీమ, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాలు ఏడారిగా మారడం ఖాయమని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని జగన్ కోరారు.
Tags:    
Advertisement

Similar News