ఓటుకు నోటు పురోగతిపై గవర్నర్‌కు కేసీఆర్ వివరణ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే విషయం, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం, ఈ నేపథ్యంలో జరిగిన తాజా పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుకు సంబంధించి కేంద్రం వద్ద […]
Advertisement
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే విషయం, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం, ఈ నేపథ్యంలో జరిగిన తాజా పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుకు సంబంధించి కేంద్రం వద్ద చేసిన విజ్ఞప్తిని, కేంద్ర మనోగతాన్ని కూడా గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలిసింది. ఢిల్లీ వెళ్ళిన గవర్నర్ అక్కడి పరిణామాలను, కేంద్రం ఆలోచనలను కేసీఆర్‌తో గవర్నర్ పంచుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు వాయిస్‌గా చెబుతున్న టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిన విషయాన్ని, వాటి నివేదిక కోసం అవినీతి నిరోధకశాఖ ఎదురు చూస్తున్న విషయాన్ని కేసీఆర్ గవర్నర్‌కు వివరించారని తెలుస్తోంది.
Advertisement