చంద్ర‌బాబుకు ఈ వారం కీల‌కం!

స్టీఫెన్‌స‌న్‌ వాంగ్మూలం, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక, అదనపు ఎఫ్‌ఐఆర్‌లో పేర్ల అంశాలను పరిశీలించిన తర్వాత చంద్ర‌బాబు బృందానికి నోటీసులు జారీ చేయాల‌ని అవినీతి నిరోధ‌క‌శాఖ భావిస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే న్యాయ నిపుణులతో ఏసీబీ అధికారులు సంప్ర‌దించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ఒక ఎత్తయితే వచ్చేవారంలో జరిగే పరిణామాలు కీలకం కానున్నాయి. త‌మ‌కు అందిన 14 టేపులను ఫోరెన్సిక్‌ అధికారులు అన్ని కోణాల్లో పరీక్షించి, పరిశీలించి కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ అంశాల‌తోపాటు […]

Advertisement
Update:2015-06-14 03:40 IST

స్టీఫెన్‌స‌న్‌ వాంగ్మూలం, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక, అదనపు ఎఫ్‌ఐఆర్‌లో పేర్ల అంశాలను పరిశీలించిన తర్వాత చంద్ర‌బాబు బృందానికి నోటీసులు జారీ చేయాల‌ని అవినీతి నిరోధ‌క‌శాఖ భావిస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే న్యాయ నిపుణులతో ఏసీబీ అధికారులు సంప్ర‌దించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ఒక ఎత్తయితే వచ్చేవారంలో జరిగే పరిణామాలు కీలకం కానున్నాయి. త‌మ‌కు అందిన 14 టేపులను ఫోరెన్సిక్‌ అధికారులు అన్ని కోణాల్లో పరీక్షించి, పరిశీలించి కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ అంశాల‌తోపాటు రేవంత్‌ రెడ్డి అరెస్టు సమయంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలతోపాటు స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నాలుగున్నర కోట్ల రూపాయలను టీడీపీ ముఖ్య నేతల కార్పొరేట్‌ సంస్థల నుంచి అందినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ అంశంపైన కూడా దర్యాప్తు పూర్తి చేయనుంది. మరోవైపు, సోమ, మంగళవారాల్లో స్టీఫెన్‌స‌న్‌ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయించాలని ఏసీబీ భావిస్తోంది. అనంతరం, కస్టడీలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కోర్టులో ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు వచ్చే వారం మరింత కీలకం కానుందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News