ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ఆచితూచి అడుగులు!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ, ఇంటెలిజెన్స్‌, ఏసీబీ అధికారుల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై చర్చించారు. ఈ స‌మావేశం త‌ర్వాత‌ ఫోన్ల ట్యాపింగ్‌ అంశంపై కాస్త సంయమనం పాటించాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినందున స్పందన చూసిన త‌ర్వాత త‌దుపరి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాల‌ని నిర్ణ‌యించింది. మరోవైపు ఓటుకు నోటు కేసు ఈ వారం కీలకం కానుంది. సీఎం, ఇంటిలిజెన్స్ అధికారుల సహా మొత్తం 120 మంది ఫోన్లు […]

Advertisement
Update:2015-06-14 09:31 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ, ఇంటెలిజెన్స్‌, ఏసీబీ అధికారుల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై చర్చించారు. ఈ స‌మావేశం త‌ర్వాత‌ ఫోన్ల ట్యాపింగ్‌ అంశంపై కాస్త సంయమనం పాటించాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినందున స్పందన చూసిన త‌ర్వాత త‌దుపరి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాల‌ని నిర్ణ‌యించింది. మరోవైపు ఓటుకు నోటు కేసు ఈ వారం కీలకం కానుంది. సీఎం, ఇంటిలిజెన్స్ అధికారుల సహా మొత్తం 120 మంది ఫోన్లు ట్యాప్‌ చేశారని నిర్ధారించుకున్న ఏపీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినందున కేంద్ర హోంశాఖ విచార‌ణ జ‌రుపుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో ఇచ్చే నివేదిక ఆధారం చేసుకుని తెలంగాణ ప్రభుత్వంపై కేసులు నమోదు చేయవచ్చునని చంద్రబాబుకు న్యాయ నిపుణులు సూచించారు. అంతవరకు సంయమనం పాటించాలని బాబు నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంశాఖ నుంచి నివేదిక రాగానే కేంద్రం తీసుకునే చర్యలతోపాటు కేసులు నమోదు చేసి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విష‌యాల‌నే ఏపీ ముఖ్య‌మంత్రి ఈరోజు జ‌రిగిన స‌మావేశంలో చ‌ర్చించార‌ని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News