ఏసీబీ వలలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు
ఏపీలో రెండు ప్రాంతాల్లోని బ్యాంకు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. విజయవాడ ఐడీబీఐ మెయిన్ బ్రాంచి మేనేజర్ రమణారెడ్డి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. దేవీసాయి కోల్డ్ స్టోరేజీని జప్తు చేయకుండా ఉండేందుకు రమణారెడ్డి రూ5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ ఫిర్యాదుదారుని నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రమణారెడ్డిని అరెస్టు చేసింది. […]
Advertisement
ఏపీలో రెండు ప్రాంతాల్లోని బ్యాంకు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. విజయవాడ ఐడీబీఐ మెయిన్ బ్రాంచి మేనేజర్ రమణారెడ్డి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. దేవీసాయి కోల్డ్ స్టోరేజీని జప్తు చేయకుండా ఉండేందుకు రమణారెడ్డి రూ5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ ఫిర్యాదుదారుని నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రమణారెడ్డిని అరెస్టు చేసింది. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఓ బ్యాంకు మేనేజర్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పి.గన్నవరం మండలం నాగుల్లంక ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న కె.వంశీ రవికుమార్.. ఎస్సీ కార్పొరేషన్ రుణ మొత్లాలను విడుదల చేసేందుకు ఒక్కో లబ్దిదారుడిని నుంచి రూ.20వేల డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లబ్దిదారుడు దుర్గారావు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా వంశీ రవికుమార్‌ను అరెస్టు చేశారు.
Advertisement