హైదరాబాద్‌లో సంతోషం తక్కువే..
దేశంలోనే అత్యంత ఆనందమయ జీవితాన్ని చండీగఢ్ వాసులు గడుపుతున్నారని.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారు ఎల్‌జీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి, సంపాదనతోపాటు కుటుంబం కోసం గడిపే విలువైన సమయం, అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని 16 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో గౌహతి అట్టడుగు స్థానంలో నిలిచింది. ముంబై, జైపూర్, కొచ్చి, హైదరాబాద్ వెనకనుంచి టాప్-5 స్థానాలో ఉన్నాయి. […]
Advertisement
దేశంలోనే అత్యంత ఆనందమయ జీవితాన్ని చండీగఢ్ వాసులు గడుపుతున్నారని.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారు ఎల్‌జీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి, సంపాదనతోపాటు కుటుంబం కోసం గడిపే విలువైన సమయం, అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని 16 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో గౌహతి అట్టడుగు స్థానంలో నిలిచింది. ముంబై, జైపూర్, కొచ్చి, హైదరాబాద్ వెనకనుంచి టాప్-5 స్థానాలో ఉన్నాయి. మెట్రో నగరాల విషయానికొస్తే.. ఢిల్లీ ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నామని తెలిపితే.. ముంబైకర్లు మాత్రం ‘అబ్బే.. జీవితం గొప్పగా ఏమీ లేదని’ స్పష్టం చేశారు. ఒక్కో ప్రాంతం నుంచి వివిధ ఆర్థిక, సామాజిక వర్గాలకు చెందిన 150 మందిని శాంపిల్‌గా తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.
Advertisement