ట్విటర్ టెర్రరిస్ట్‌కు మూడున్నరేళ్ల జైలు...
సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్‌ను కేంద్రంగా చేసుకుని ప్రజలను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తున్న అలా ఇసయెద్ యువతికి బ్రిటిష్ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. 2013 నుంచి సుమారు ఏడాది కాలం పాటు ఆమె తన ట్విటర్ అకౌంట్ నుంచి అరబిక్ భాషలో దాదాపు 45 వేల ట్వీట్స్ పంపించింది. ఈ అకౌంట్‌కు ఎనిమిది వేల మందికి పైగా ఫాలోయర్లున్నారు. కషెల్నికొవ్ గన్ పట్టుకుని బురఖా ధరించిన యువతి బొమ్మ ఈ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్‌గా […]
Advertisement
సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్‌ను కేంద్రంగా చేసుకుని ప్రజలను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తున్న అలా ఇసయెద్ యువతికి బ్రిటిష్ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. 2013 నుంచి సుమారు ఏడాది కాలం పాటు ఆమె తన ట్విటర్ అకౌంట్ నుంచి అరబిక్ భాషలో దాదాపు 45 వేల ట్వీట్స్ పంపించింది. ఈ అకౌంట్‌కు ఎనిమిది వేల మందికి పైగా ఫాలోయర్లున్నారు. కషెల్నికొవ్ గన్ పట్టుకుని బురఖా ధరించిన యువతి బొమ్మ ఈ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంది. అత్యంత ముఖ్యమైన 66 ట్విటర్ జిహాదీ అకౌంట్లలో అలా అకౌంట్ కూడా ఒకటని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కూడా గుర్తించింది. ఇరాక్‌లోని మొసుల్ ప్రాంతానికి చెందిన ఈమె కుటుంబం 2007లో దక్షిణ లండన్‌లోని కెనింగ్టన్‌లో స్థిరపడింది. ఇసయెద్ నేరాలపై విచారణ అనంతరం ఓల్డ్ బెయిలీ కోర్టు ఆమెకి శిక్ష విధించింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువతీ యువకులు విదేశాలకు కూడా వెళ్లేందుకు ఇసయెద్ ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే తనకు అరబిక్ చదవడం, రాయడం తెలియదని, కేవలం ఇతర సైట్లు, బ్లాగుల నుంచి కాపీ, పేస్ట్ చేసేదాన్నని కోర్టు ముందు అలా ఇసయెద్ బుకాయించింది. అయినా శిక్ష నుంచి ఆమె తప్పించుకోలేక పోయింది.
Advertisement