విశాఖ వైపు బంగారం స్మగ్లర్ల చూపు!
ఇప్పటివరకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ఇపుడిపుడే విశాఖ విమానాశ్రయం వైపు మళ్ళుతుంది. సాధారణంగా ఇక్కడకు వచ్చేది సాధారణ ప్రయాణీకులే. వీరు పెద్ద మొత్తంలో స్మగ్లంగ్‌కు పాల్పడే అవకాశాలు తక్కువ. కాని ఇపుడు హైదరాబాద్‌లో నిఘా పెరగడం, ఎక్కువ మంది స్మగ్లర్లు దొరికిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధాన విమానాశ్రయం అయిన విశాఖ వైపు వారి దృష్టి పడింది. సాధారణంగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు అంతర్జాతీయ విమానాలు వేదిక అవుతాయి. ఇప్పుడిప్పుడే […]
Advertisement
ఇప్పటివరకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ఇపుడిపుడే విశాఖ విమానాశ్రయం వైపు మళ్ళుతుంది. సాధారణంగా ఇక్కడకు వచ్చేది సాధారణ ప్రయాణీకులే. వీరు పెద్ద మొత్తంలో స్మగ్లంగ్‌కు పాల్పడే అవకాశాలు తక్కువ. కాని ఇపుడు హైదరాబాద్‌లో నిఘా పెరగడం, ఎక్కువ మంది స్మగ్లర్లు దొరికిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధాన విమానాశ్రయం అయిన విశాఖ వైపు వారి దృష్టి పడింది. సాధారణంగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు అంతర్జాతీయ విమానాలు వేదిక అవుతాయి. ఇప్పుడిప్పుడే విశాఖకు ఈ విమానాల రాకపోకలు పెరగడంతో.. స్మగ్లర్లు కూడా ఈ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు. గతవారం 2.5 కోట్ల విలువైన బంగారం తనిఖీల్లో పట్టుబడింది. విశాఖ విమానాశ్రయంలో ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం ఇదే ప్రథమం.
గోల్డ్ స్మగ్లింగ్ ప్రధానంగా దుబాయ్ నుంచి కొనసాగుతోంది. దుబాయ్‌లో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడి నుంచి స్మగ్లింగ్ తేలికగా జరుగుతుందన్న వాదన ఉంది. అంతేగాక అక్కడ విమానాశ్రయంలో పెద్దగా తనిఖీలు ఉండకపోవడం స్మగ్లర్లకు కలిసి వస్తోంది. ఇదే పెద్ద బిజినెస్‌గా చేసుకున్న స్మగ్లర్లు.. కొంతమందిని నియమించుకుని దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారు. డబ్బుపై ఆశ ఉన్నవారిని, దుబాయ్ పర్యటనపై ఆసక్తి ఉన్నవారిని బంగారం స్మగ్లింగ్‌కు వాడుకుంటున్నారు. బంగారం తీసుకువచ్చిన తర్వాత వారికి దాని విలువలో కొంత శాతం ముట్టజెబుతామని ఎర వేయడంతో సాధారణ ప్రయాణికులు కూడా ఆసక్తి చూపుతున్నారు. డొమెస్టిక్ ప్యాసింజర్లపై కస్టమ్స్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో స్మగ్లింగ్‌కు పాల్పడడం చాలా తేలికన్న భావన ఉంది.ఈ విషయం పసిగట్టిన కస్టమ్స్ అధికారులు ఇప్పటివరకు అంతంత మాత్రంగానే ఉన్న తనిఖీలను కట్టుదిట్టం చేయడంతో.. గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తోంది.
Advertisement