వైసీపీ నేత ఆస్తులు స్వాధీనం
బ్యాంక్ రుణం చెల్లించలేదని వైసీపీ నాయకుడు, విజయవాడ దుర్గామల్లేశ్వరి దేవస్థానం మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి ఆస్తులను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పిడపర్తి లక్ష్మీకుమారి, పిడపర్తి నారాయణరెడ్డి పేరుమీద తునికిపాడు గ్రామ సమీపంలో నిర్మించిన బేబిసాయి కోల్డ్ స్టోరేజ్‌ను 2010వ సంవత్సరంలో విజయవాడ ఐడీబీఐకి నారాయణరెడ్డి తనఖా పెట్టి రూ. 2,58,77,209ల భారీ రుణాన్ని తీసుకున్నారు. దీన్ని తిరిగి చెల్లించకపోవడంతో గత సంవత్సరం 2014 ఏప్రిల్ 24న ఐడీబీఐ అధికారులు ఆయనకు నోటీ సులు ఇచ్చారు. […]
Advertisement
బ్యాంక్ రుణం చెల్లించలేదని వైసీపీ నాయకుడు, విజయవాడ దుర్గామల్లేశ్వరి దేవస్థానం మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి ఆస్తులను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పిడపర్తి లక్ష్మీకుమారి, పిడపర్తి నారాయణరెడ్డి పేరుమీద తునికిపాడు గ్రామ సమీపంలో నిర్మించిన బేబిసాయి కోల్డ్ స్టోరేజ్‌ను 2010వ సంవత్సరంలో విజయవాడ ఐడీబీఐకి నారాయణరెడ్డి తనఖా పెట్టి రూ. 2,58,77,209ల భారీ రుణాన్ని తీసుకున్నారు. దీన్ని తిరిగి చెల్లించకపోవడంతో గత సంవత్సరం 2014 ఏప్రిల్ 24న ఐడీబీఐ అధికారులు ఆయనకు నోటీ సులు ఇచ్చారు. నోటీసుల్లో 60 రోజుల్లో రు ణం చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. అయినప్పటికీ బ్యాంక్ రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు జిల్లా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి నారాయణరెడ్డి ఆస్తుల స్వాధీనానికి సంబంధించి అనుమతి పొందారు. అందులో భాగంగానే ఆస్తులను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement