ఐఎన్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశం
భారత దేశం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాల వాహక నౌక ఐఎన్‌ఎస్- విక్రాంత్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఈ యుద్ధ విమానాల వాహక నౌకను కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) రూపొందించింది. అతి సాదాసీదాగా జరిగిన ఈ జలప్రవేశ కార్యక్రమంలో సీఎస్‌ఎల్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్రహ్మణ్యం సహా పలువురు షిప్‌యార్డ్ అధికారులు పాల్గొన్నారు. దీంతో ఈ పరిజ్ఞానం, పాటవం ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌ల సరసన […]
Advertisement
భారత దేశం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాల వాహక నౌక ఐఎన్‌ఎస్- విక్రాంత్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఈ యుద్ధ విమానాల వాహక నౌకను కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) రూపొందించింది. అతి సాదాసీదాగా జరిగిన ఈ జలప్రవేశ కార్యక్రమంలో సీఎస్‌ఎల్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్రహ్మణ్యం సహా పలువురు షిప్‌యార్డ్ అధికారులు పాల్గొన్నారు. దీంతో ఈ పరిజ్ఞానం, పాటవం ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌ల సరసన భారతదేశం సగర్వంగా నిలుచుంది. 40 వేల టన్నుల బరువు, 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ యుద్ధ విమానాల వాహక నౌకపై రెండు టేకాఫ్ రన్‌వేలు, ఒక లాండింగ్ సెటప్ ఉంది. తక్కువ సమయంలోనే టేకాఫ్ తీసుకునే యుద్ధ విమానాల కోసం స్టోబార్, హెలికాప్టర్‌లు నిలిపే సదుపాయం ఉన్నాయి. డాక్‌యార్డు నుంచి జలాల్లోకి ప్రవేశ పెట్టిన విక్రాంత్‌ను రకరకాలుగా ప్రయోగించి పూర్తి సంతృప్తి కలిగిన తర్వాతే భారత సైన్యానికి అప్పగించనున్నారు.
Advertisement