ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం విచార‌ణ‌?

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఈ రెండు అంశాల‌పై అంత‌ర్గ‌త విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. నిన్న రాత్రే ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.అస‌లు ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందా లేదా ఒక‌వేళ జ‌రిగి ఉంటే ఎంత‌మంది ఫోన్‌లు ట్యాపింగ్ జ‌రిగింది. ఇందులో కీల‌క‌మైన వ్య‌క్తులు ఎంద‌రున్నారు? వారి ఫోన్‌లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది, దీనికి ముంద‌స్తు అనుమ‌తులున్నాయా అనే అంశాల‌తోపాటు ట్యాపింగ్ ప‌రిధిలో చుట్టూ ఉన్న […]

Advertisement
Update:2015-06-11 09:05 IST
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఈ రెండు అంశాల‌పై అంత‌ర్గ‌త విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. నిన్న రాత్రే ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.అస‌లు ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందా లేదా ఒక‌వేళ జ‌రిగి ఉంటే ఎంత‌మంది ఫోన్‌లు ట్యాపింగ్ జ‌రిగింది. ఇందులో కీల‌క‌మైన వ్య‌క్తులు ఎంద‌రున్నారు? వారి ఫోన్‌లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది, దీనికి ముంద‌స్తు అనుమ‌తులున్నాయా అనే అంశాల‌తోపాటు ట్యాపింగ్ ప‌రిధిలో చుట్టూ ఉన్న అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. విచారణ ఏ శాఖ చేపట్టాలన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. కేంద్ర హోంశాఖ లేదా టెలికమ్యూనికేషన్లశాఖ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఓటుకు నోటు వ్య‌వ‌హారం కేసులో కూడా ఎవ‌రెవరి పాత్ర ఉంది? ఈ అంశానికి సంబంధించి ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి అనే విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని హోం శాఖ ఆదేశించిన‌ట్టు తెలిసింది.

ఇదే అంశంపై నిన్న(బుధవారం)ప్రధాని, హోంశాఖ మంత్రి, రాష్ట్రపతితో ఏపీ చంద్రబాబు నాయుడు సమావేశమై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి సహా 120 మంది ప్రముఖుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని….దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరపాలని ప్రధానిని కోరారు. చంద్రబాబు ఫిర్యాదుపై కొన్ని గంటల్లోనే కేంద్రం స్పందించింది. ఫోన్‌ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం దానిపై కేంద్రం స్పందించడం సంచలనం కలిగిస్తోంది.
Tags:    
Advertisement

Similar News