బాబును కేంద్రం కాపాడక పోవచ్చు: జగన్

అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఎ-1 ముద్దాయిగా చేర్చాలని తాను రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరానని వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని ఆయన […]

Advertisement
Update:2015-06-11 12:16 IST
అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఎ-1 ముద్దాయిగా చేర్చాలని తాను రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరానని వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు ఇప్పటికే బయటకు వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ కేసులో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అవినీతి రారాజు చంద్రబాబు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం దీన్ని గమనించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
Tags:    
Advertisement

Similar News