ఇక చైన్ లాగితే రైలు ఆగదు!
చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో రైల్వేలు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అందువల్ల ఇక నుంచి ‘చైన్ లాగితే రైలు ఆగే విధానం’కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. దాంతోపాటు రైల్లోని ఇతర సిబ్బంది కూడా వాకీటాకీలతో అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే ప్రయాణికులు వారిని సంప్రదించవచ్చు. చైన్ […]
Advertisement
చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో రైల్వేలు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అందువల్ల ఇక నుంచి ‘చైన్ లాగితే రైలు ఆగే విధానం’కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. దాంతోపాటు రైల్లోని ఇతర సిబ్బంది కూడా వాకీటాకీలతో అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే ప్రయాణికులు వారిని సంప్రదించవచ్చు. చైన్ విధానాన్ని ఇప్పటికే చాలా కోచ్‌లలో తీసేశారు. కొత్త బోగీల్లో చైన్‌లు లేకుండా చూడాలని కోచ్ తయారీ యూనిట్లకు ఇప్పటికే సూచనలు కూడా చేశారు. అంటే ఇక నుంచి కొత్తగా తయారయ్యే కోచ్‌లలో అసలు చైన్‌లే ఉండవు. పాత కోచ్‌లలో కూడా క్రమంగా తొలగిస్తారన్న మట!
Advertisement