నా భార్య అలాంటిది కాదు అంటున్న రాజమౌళి

‘కార్యేషు మంత్రి ‘అనే మాటకు పర్ఫెక్ట్‌గా సరిపోతారు రమా రాజమౌళి. జక్కన్న తీసే సినిమాలలో ఆయన భార్య రమ పాత్ర మనకు తెలుపకపోయినా తెలుస్తూనే ఉంటుంది. తను రాజమౌళి సినిమాలలో కాస్ట్యూమ్‌స్ సెలెక్షన్ దగ్గర నుండి అన్నీ చూసుకోవడం మనకు తెలుసు. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో. కాని నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కావాలి అనే టైప్ కాదు నా భార్య రమ. ఆమె అలాంటిది కాదు కనుకే, నేను ఈ మాత్రం నా జాబ్ […]

Advertisement
Update:2015-06-10 06:00 IST

‘కార్యేషు మంత్రి ‘అనే మాటకు పర్ఫెక్ట్‌గా సరిపోతారు రమా రాజమౌళి. జక్కన్న తీసే సినిమాలలో ఆయన భార్య రమ పాత్ర మనకు తెలుపకపోయినా తెలుస్తూనే ఉంటుంది. తను రాజమౌళి సినిమాలలో కాస్ట్యూమ్‌స్ సెలెక్షన్ దగ్గర నుండి అన్నీ చూసుకోవడం మనకు తెలుసు. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో. కాని నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కావాలి అనే టైప్ కాదు నా భార్య రమ. ఆమె అలాంటిది కాదు కనుకే, నేను ఈ మాత్రం నా జాబ్ చేసుకోగలుగుతున్నాను ‘ అంటున్నారు డైరెక్టర్ రాజమౌళి.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా రాజమౌళి, తన బెటర్ హాఫ్ ఇల్లంతా చక్కబెట్టుకోవడం వలననే తాను తన పనిలో పూర్తిగా నిమగ్నం అవుతున్నానని ఆమెకు క్రెడిట్ ఇచ్చారు. ఆమె డబ్బు విషయాలలో మరీ యాంబిషియస్ కాదు కనుకే తనకు డబ్బువెనుక పడాల్సిన అవసరం కలుగలేదని, అలా అని డబ్బు అవసరం లేదని కాదు కాని, డబ్బు తనకు డ్రైవింగ్ ఫోర్స్ కాకపోవడం మాత్రం తన భార్య రమ అని మురిపెంగా చెప్పుకొచ్చారు మన టాలివుడ్ జక్కన్న. హ్యాట్సాఫ్ టు రమా రాజమౌళి!

Tags:    
Advertisement

Similar News