చంద్రబాబుతో సహా 20 మందికి నోటీసులు జారీ?
ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధకశాఖ విచారణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ప్రశ్నించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో చంద్రబాబుతోపాటు మొత్తం 20 మంది పేర్లు బయట పడినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం పేర్లను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిసింది. కోర్టుకు సమర్పిస్తే చంద్రబాబుతోపాటు ఈ ఇరవై మందికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో […]
Advertisement
ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధకశాఖ విచారణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ప్రశ్నించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో చంద్రబాబుతోపాటు మొత్తం 20 మంది పేర్లు బయట పడినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం పేర్లను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిసింది. కోర్టుకు సమర్పిస్తే చంద్రబాబుతోపాటు ఈ ఇరవై మందికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఈ కేసులో నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహల ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమకు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఏదీ లభించలేదని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అయితే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు, పాస్‌పోర్టులు, విదేశీ మద్యం, ఆస్తుల పత్రాలు తాము గమనించామని అయితే ఇవేమీ తాము స్వాధీనం చేసుకోలేదని ఆయన తెలిపారు. కేసుకు సంబంధం లేని అంశాల జోలికి తాము వెళ్ళలేదని, అయితే అనుమానంతో కంప్యూటర్‌కు సంబంధించిన పాత సీపీయు ఒకటి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఈరోజుతో ఈ ముగ్గురి నిందితుల కస్టడీ ముగుస్తుందని, సాయంత్రం వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాలుగు గంటలకు కోర్టుకు సబ్‌మిట్ చేస్తామని ఆయన తెలిపారు. వారి కస్టడీ పొడిగింపుకు తాము ప్రయత్నించడం లేదని చెప్పారు.
Advertisement