చంద్రబాబూ... రాజీనామాకు సిద్ధమా? : జేపీ
స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లు ఇవ్వజూపింది వాస్తవమా? కాదా ? చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని లోక్‌సత్తా నేత జేపీ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగా? రికార్డింగా అనేది కోర్టు చూసుకుంటుందని, ఇది నిజమేనని తేలితే చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా అని జేపీ ప్రశ్నించారు. చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేశారు. మిగతా వివాదాలు ఎలా ఉన్నా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నామినేట్ అయిన మరో ఎమ్మెల్యే ఓటు కోసం రూ. 5 కోట్లు ఇవ్వజూపిన మాట […]
Advertisement
స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లు ఇవ్వజూపింది వాస్తవమా? కాదా ? చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని లోక్‌సత్తా నేత జేపీ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగా? రికార్డింగా అనేది కోర్టు చూసుకుంటుందని, ఇది నిజమేనని తేలితే చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా అని జేపీ ప్రశ్నించారు. చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేశారు. మిగతా వివాదాలు ఎలా ఉన్నా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నామినేట్ అయిన మరో ఎమ్మెల్యే ఓటు కోసం రూ. 5 కోట్లు ఇవ్వజూపిన మాట వాస్తవమా కాదా అని… అది జరిగిందా లేదా… ఒకవేళ అబద్ధమయితే దాన్ని చెప్పడానికి సంకోచం దేనికని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ జరిగి ఉంటే మీ ప్రేరేపణ లేకుండా, మీ అనుమతి లేకుండా ఆ ఎమ్మెల్యే సొంతంగా చేశాడా…. మీకు తెలియకుండా చేసి ఉంటే ఆయనపై ఇప్పటివరకు చర్య ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు. బంగారు లక్ష్మణ్ కేవలం 2 లక్షల రూపాయలు పార్టీ ఫండ్‌గా తీసుకుంటే ఆ నగదుకు లెక్కలు లేవంటూ ఆరోపణలొస్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవే పోయిందే మరి మీరెందుకు దానిపై పెదవి విప్పరు? అని ప్రశ్నించారు. టేపుల్లో వినిపించిన వాయిస్ చంద్రబాబుది కాదని, అది ఫాబ్రికేట్ చేశారని ఆయన పార్టీ నుంచి వాదనలొచ్చాయి. నిజంగా ఆయనది కాదని తేలితే సమస్యే లేదు… ఒకవేళ ఆయనదే అని తేలితే మీరు రాజీనామా చేయడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు. ‘మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడం నిజం కాదా?, మీ అనుమతి లేకుండా చేస్తే రేవంత్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?, అని ప్రశ్నించారు. 15 ఏళ్లల్లో ఎన్నడూ లేనివిధంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రస్థావన నిన్నే ఎందుకు తీసుకున్నారు? అని చంద్రబాబును జేపీ నిలదీశారు.
Advertisement