ప‌ర‌కాల‌.. పరాకు వ్యాఖ్యలేల ?

అసలే ఓటుకు నోటు ఎర కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలు మరింత ఇబ్బందిలో పడేశాయి. చంద్రబాబు- స్టీఫెన్‌ సన్ సంభాషణల టేపులు బయటకు పొక్కడంతో దీనిపై మీడియాకు వివరణ ఇస్తూ పరకాల ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినంత పనిచేశారు. మొదట చంద్రబాబు- స్టీఫెనసన్ సంభాషణల టేపులలో ఉన్న గొంతు చంద్రబాబుది కాదన్న ఆయన వెంటనే ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను అతికించారన్నారు. మొదట గొంతు […]

Advertisement
Update:2015-06-08 09:26 IST
అసలే ఓటుకు నోటు ఎర కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలు మరింత ఇబ్బందిలో పడేశాయి. చంద్రబాబు- స్టీఫెన్‌ సన్ సంభాషణల టేపులు బయటకు పొక్కడంతో దీనిపై మీడియాకు వివరణ ఇస్తూ పరకాల ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినంత పనిచేశారు. మొదట చంద్రబాబు- స్టీఫెనసన్ సంభాషణల టేపులలో ఉన్న గొంతు చంద్రబాబుది కాదన్న ఆయన వెంటనే ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను అతికించారన్నారు. మొదట గొంతు బాబుది కాదన్న పరకాల తరువాత బాబుదేనని ఒప్పుకోవడానికి పొంతన కుదరలేదు.
అంతు చూస్తామంటారా?
ఇది ఫోన్ట్యాపింగ్ కాకుండా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తన ఫోన్లో ఆడియో రికార్డ్ చేసిందని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. అలాంటివేమైనా ఉంటే కోర్టు సమక్షంలో ఉండాలి కదా అని పరకాల బదులిచ్చారు. దర్యాప్తు చేస్తున్నవారు ఆడియో, వీడియో టేపులు, ఇతర సాక్ష్యాధారాలు ఏమున్నా కోర్టు ముందుంచాలని, అలాకాకుంటే వీళ్లు రుజువులను తారుమారు చేస్తున్నట్టేనని చెప్పారు. ‘‘కోర్టులో ఉండాల్సినవి బయటకు వచ్చాయంటే మీరు కావాలని అభాసుపాలు చేయడానికి చేస్తున్నట్టే. ఈ ఉదంతంపై ఊరుకునే ప్రసక్తే లేదు. అంతుచూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘ఇదంతా తెలంగాణ సీఎం చేసిన పనికాదా? నాకు సంబంధం లేదని ఆయన్ను చెప్పమనండి? ఈ ఆడియో టేపులకు సోర్స్ ఏంటో చెప్పమనండి’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామన్నారు.
ఎర్రచందనం కేసులో వీడియోలు బయటికి ఎలా వచ్చాయి?
ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో 20 మంది కూలీలను కాల్చిన ఘటనలోనూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అప్పడు కూడా ఇలాగే ఎర్రచందనం స్మగ్లర్ల వీడియోలు బయటపడ్డాయి. మరి ఆ కేసు కూడా దర్యాప్తులోనే ఉండగా.. ఆ వీడియోలు ఎలా బయటపడ్డాయి? వాటిని ఏపీ సీఎం విడుదల చేశారా? ఇప్పుడు మీడియాతోపాటు ప్రజలు సంధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి పరకాల వద్ద ఏం సమాధానం ఉంటుందో? ఆయనకే తెలియాలి?
తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలా?
ఈ వ్య‌వ‌హారం ఏపీలో కేవ‌లం చంద్ర‌బాబుకు మాత్ర‌మే సంబంధించింది. దీనికి తెలుగు ప్ర‌జ‌ల‌కు ఏంటి సంబంధం? ఈ వివాదంతో తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు చెల‌రేగుతాయ‌ని ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి. ఉమ్మ‌డి మ‌ద్రాసు నుంచి ఆంధ్ర రాష్ర్టం విడిపోయి 60 ఏళ్ల‌యింది. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు తిరుప‌తికి రావ‌డం లేదా? తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో విద్యాభ్యాసం, వ్యాపారాలు చేయ‌డం లేదా? అంతెందుకు..! ప‌ర‌కాల వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. రెండు రాష్ర్టాల మ‌ధ్య విభేదాలు ఉన్న‌పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా విభేదాలు ఉండాలి క‌దా..! ఆంధ్ర రాష్ర్టం విడిపోయాక ఆయ‌నెలా త‌మిళ‌నాడు సంబంధం చేసుకున్నారు? ఇవ‌న్నీ ప‌ర‌కాల‌కు మేధావులు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు వీటికి ఆయ‌న వ‌ద్ద స‌మాధాన‌ముంటుందా?
Tags:    
Advertisement

Similar News