తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ పదవులు: యాష్కీ
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. నిజామబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో పత్తాలేని కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మాట్లాడుతున్నారని, వారు ఉద్యమ సమయంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు వసూలు చేయడంలో పేరు తెచ్చుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజ్యసభ సభ్యుడు కేవీవీపై ఆరోపణలు చేసిన […]
Advertisement
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. నిజామబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో పత్తాలేని కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మాట్లాడుతున్నారని, వారు ఉద్యమ సమయంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు వసూలు చేయడంలో పేరు తెచ్చుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజ్యసభ సభ్యుడు కేవీవీపై ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్, ప్రస్తుతం ఆయనకు చెందిన కంపెనీకే వాటర్‌గ్రిడ్ పనులను కేటాయిస్తున్నారని విమర్శించారు. ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేసిన తలసాని , తుమ్మల, మహేందర్‌రెడ్డిలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీలో చివరి వరకు ఉండి తెలంగాణను వ్యతిరేకించిన బాజిరెడ్డి గోవర్దన్‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించారన్నారు. సీఎం కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
Advertisement