టీ సర్కార్ మాట తప్పింది!: గంటా
ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి చెందిన ఫైళ్లు, రికార్డులు అప్పగిస్తామని చెప్పిన తెలంగాణ సర్కారు మాట తప్పిందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పాలిసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నత విద్యామండలి ఫైళ్లు, రికార్డులు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు వాటిని ఇవ్వలేదని గంటా పేర్కొన్నారు. తాము ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉందని, […]
Advertisement
ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి చెందిన ఫైళ్లు, రికార్డులు అప్పగిస్తామని చెప్పిన తెలంగాణ సర్కారు మాట తప్పిందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పాలిసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నత విద్యామండలి ఫైళ్లు, రికార్డులు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు వాటిని ఇవ్వలేదని గంటా పేర్కొన్నారు. తాము ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉందని, పాఠశాలల పున:ప్రారంభమయ్యే జూన్15 నాటికి డీఎస్సీ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. తమకు వెంటనే రికార్డులు అప్పగించాలని ఆయన కోరారు.
Advertisement