చంద్రబాబు-స్టీఫెన్ టేపులు బహిర్గతం
ఓటుకు నోటు కేసులో కీలక సూత్రధారి చంద్రబాబు సంబంధాలపై ఆడియో టేపులు బయటపడ్డాయి. రూ. 5 కోట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలు పటాపంచలవుతూ ఈ టేపులు సాక్ష్యాలను బయటపెట్టాయి. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మధ్యలో మూడో వ్యక్తి చంద్రబాబు మాట్లాడతారంటూ స్టీఫెన్‌సన్‌ను లైన్ పెట్టి మాట్లాడించారు. చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ల సంభాషణ ఇలా సాగింది…. మూడో వ్యక్తి: హలో…. హాలో… బ్రదర్ ..అవుర్ బాబుగారు వాంట్స్ టు […]
Advertisement
ఓటుకు నోటు కేసులో కీలక సూత్రధారి చంద్రబాబు సంబంధాలపై ఆడియో టేపులు బయటపడ్డాయి. రూ. 5 కోట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలు పటాపంచలవుతూ ఈ టేపులు సాక్ష్యాలను బయటపెట్టాయి. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మధ్యలో మూడో వ్యక్తి చంద్రబాబు మాట్లాడతారంటూ స్టీఫెన్‌సన్‌ను లైన్ పెట్టి మాట్లాడించారు. చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ల సంభాషణ ఇలా సాగింది….
మూడో వ్యక్తి: హలో…. హాలో… బ్రదర్ ..అవుర్ బాబుగారు వాంట్స్ టు టాక్ టు యు.
ప్లీజ్ బి ఆన్ ది లైన్
ప్లీజ్ బి ఆన్ ది లైన్
చంద్రబాబు: హలో
స్టీఫెన్‌సన్: సర్ గుడ్ ఈవినింగ్ సార్.
చంద్రబాబు: హౌ ఆర్ యు.
స్టీఫెన్‌సన్: ఫైన్ సార్ థాంక్యూ సార్.
చంద్రబాబు: అన్నిటికి మీకు నేను అండగా ఉంటా…
వారు మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
వారు మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
స్టీఫెన్‌సన్: యస్ సార్… రైట్ సార్
చంద్రబాబు: ఐ యామ్ విత్ యు. డోంట్ బాదర్… మనవాళ్ళు నాకంతా వివరించారు.
స్టీఫెన్‌సన్: యస్ సార్…
చంద్రబాబు: కంగారు పడాల్సిన పని లేదు. మీకు అండగా నేనుంటాను.
అది మా హామీ… కలిసి పని చేద్దాం. ఓ.కె.
అది మా హామీ… కలిసి పని చేద్దాం. ఓ.కె.
స్టీఫెన్‌సన్: ఓ.కే.సార్
కాగా అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ వారంలో కేసీఆర్ గవర్నర్‌ని కలవడం రెండోసారి. వీరి సంభాషణల్లో ఓటుకు నోటు కేసు చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో గవర్నర్ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు వివరించే షెడ్యూల్ ఉన్నందున కేసీఆర్ గవర్నర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, స్టీఫెన్‌సన్ సంభాషణల టేపులు బహిర్గతమైన నేపథ్యంలో ఈ భేటీ ఇపుడు మరింత చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం చంద్రబాబునాయుడు రాజధాని వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ టేపులు బహిర్గతం కావడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
Advertisement